Sunday, 3 December 2017

ఉపాధ్యాయులుగా మనం కొన్ని అలవాట్లు మానుకుంటే మంచిది



💥 💥 ఉపాధ్యాయులుగా మనం కొన్ని అలవాట్లు (ఉంటే) మానుకుంటే మంచిది. ఎందుకంటే సమాజం కన్ను మన మీద ఉన్నంతగా ఇతరుల మీద ఉండదు!
💥 💥 ప్రమాదాన్ని కొనితేగల కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఇవి :-

💥 1. బడికి ఆలస్యంగా రావడం, ముందుగా వెళ్ళి పోవడం
💥 2. బడిలో ధూమపానం చేయడం
💥 3. డ్రింక్ చేసి స్కూలుకు రావడం
💥 4. టీ షార్ట్స్ జీన్ ప్యాంట్స్, ఇతర అసాధారణ దుస్తులు వేసుకోవడం.
💥 5. అమ్మాయిల్ని రావే,పోవే అనడం. అమ్మాయిలను తాకడం. వాళ్ళ ముందు అసభ్య పదజాలం ఉపయోగించడం, అసభ్యంగా ప్రవర్తించడం
💥 6. కులాలు, మతాలు సాంప్రదాయాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.
💥 7. తరగతి గదిలో ఫోను ఉపయోగించడం, ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం
💥 8. పిల్లల్ని కాపీకి ప్రోత్సహించడం, జవాబు పత్రాలు సరిగా చూడకుండానే మార్కులు వేయడం, దిద్దకుండా మార్కులు వేయడం
💥 9. పిల్లలతో ఫని చేయించడం (ఉదా: బయటి నుంచి సరుకులు, బియ్యం బస్తాలు, నీళ్ళు తెప్పించడం) బడికి సంబంధించిన పనులైతే మనం పాల్గొనకుండా కేవలం వాళ్ళతోనే చేయించడం.
💥 10. పిల్లలకు నోటు పుస్తకాలు వగైరా అమ్మడం (లాభాపేక్షతో)
💥 11. పిల్లల్ని కూరగాయలు వగైరా తెమ్మని పురమాయించడం
💥 12. మహిళా, పురుష ఉపాధ్యాయులు అతి చనువుగా వ్యవహరించడం, పరాచికాలాడడం
💥 13. పిల్లల ముందు పోట్లాడుకోవడం, గట్టిగా వాదులాడుకోవడం.
💥 14. విద్యార్థుల పట్ల పక్షపాత ధోరణి కనబర్చడం.
💥 15. క్లాసులకి ఆలస్యంగా వెళ్ళడం, పూర్తి కాకముందే బయటకు రావడం, అసలు వెళ్ళక పోవడం
💥 16. విద్యార్థులనువిచక్షణారహితంగా దండించడం. చెడు పదజాలంతో దూషించడం.
💥 17. మధ్యాహ్న భోజనం వాళ్ళచే వేరే కూరలు చేయించు కోవడం, మధ్యాహ్న భోజనం తినడం, పాఠశాలలో పార్టీలు చేసుకోవడం.

👉 ఆత్మ విమర్శ చేసుకొని ఇందులో మనకేమైనా వర్తించేవి ఉంటే ఆవి మానుకుంటే అందరికీ క్షేమదాయకం.
👉 కొస మెరుపు: ఎవ్వరూ చూడడం లేదు కదా అనుకోకండి. అన్నీ గమనించే వాళ్ళు పిల్లలు. మన పిల్లలే కదా అనుకోకండి. వాళ్ళు కూడా సమాజంలో భాగమే.

మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు వాటి అర్ధం



💥 💥 మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు ఎప్పుడైనా గమనించారా? రంగుకి అర్ధం ఏంటో తెలుసా? 💥 💥

👉 మనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్లేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు, ఇటు మైలు రాళ్లు కనిపిస్తాయి కదా. వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళితే మన గమ్యస్థానం వస్తుందో, మనం ప్రాంతానికి దగ్గర్లో ఉన్నామో, దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం. గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్నెమ్మదిగా వెళ్తాం. ఇలా అనేక రకాలుగా మైలు రాళ్లు మనకు ఉపయోగపడతాయి. వాటితో దూరాలను కూడా తెలుసుకోవచ్చు. అయితే మనకు కనపడే మైలు రాళ్ల పై భాగంలో ఒక్కోసారి ఒక్కో కలర్ఉంటుంది గమనించారా..? అవును, కరెక్టే. అయితే అలా మైలు రాళ్లకు భిన్నమైన రంగులను పై భాగంలో ఎందుకు వేస్తారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

👉 మైలు రాళ్ల పై భాగంలో పసుపు రంగు ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని మాత్రమే జాతీయ రహదారులు ఉంటాయి. వాటిపై ఉండే మైలు రాళ్లకు పై భాగంలో ఇలా పసుపు రంగులో పెయింట్వేస్తారు. దీంతో అవి జాతీయ రహదారులు అని తెలుస్తాయి.

👉 మైలు రాళ్ల పైభాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్హైవేలు అని తెలుసుకోవాలి. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.

👉 మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే మనం ప్రయాణిస్తున్నది పెద్ద నగరం లేదా జిల్లా అని తెలుసుకోవాలి. ఇలాంటి రహదారులను నగర లేదా జిల్లా అభివృద్ధి శాఖే పర్యవేక్షిస్తుంది.

👉 ఇక మైలు రాళ్ల పైభాగంలో ఆరెంజ్లేదా ఎరుపు రంగు పెయింట్వేసి ఉంటే మనం గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి. అలాగే రోడ్లను ప్రధాన్మంత్రి గ్రామ్ సడక్యోజన కింద నిర్మించారని అర్థం చేసుకోవాలి.

EVERGREEN POSTS