💥 💥 ఉపాధ్యాయులుగా మనం కొన్ని అలవాట్లు (ఉంటే) మానుకుంటే మంచిది. ఎందుకంటే సమాజం కన్ను
మన మీద ఉన్నంతగా ఇతరుల మీద ఉండదు!
💥 💥 ప్రమాదాన్ని కొనితేగల కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఇవి :-
💥 1. బడికి ఆలస్యంగా రావడం,
ముందుగా వెళ్ళి
పోవడం
💥 2. బడిలో ధూమపానం చేయడం
💥 3. డ్రింక్ చేసి స్కూలుకు రావడం
💥 4. టీ షార్ట్స్ జీన్ ప్యాంట్స్, ఇతర అసాధారణ దుస్తులు
వేసుకోవడం.
💥 5. అమ్మాయిల్ని రావే,పోవే అనడం. అమ్మాయిలను
తాకడం. వాళ్ళ ముందు అసభ్య పదజాలం ఉపయోగించడం, అసభ్యంగా ప్రవర్తించడం
💥 6. కులాలు, మతాలు సాంప్రదాయాలకు
సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.
💥 7. తరగతి గదిలో ఫోను ఉపయోగించడం, ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం
💥 8. పిల్లల్ని కాపీకి
ప్రోత్సహించడం, జవాబు పత్రాలు సరిగా
చూడకుండానే మార్కులు వేయడం,
దిద్దకుండా మార్కులు
వేయడం
💥 9. పిల్లలతో ఫని చేయించడం (ఉదా: బయటి నుంచి సరుకులు, బియ్యం బస్తాలు, నీళ్ళు తెప్పించడం) బడికి సంబంధించిన పనులైతే మనం పాల్గొనకుండా కేవలం వాళ్ళతోనే
చేయించడం.
💥 10. పిల్లలకు నోటు పుస్తకాలు
వగైరా అమ్మడం (లాభాపేక్షతో)
💥 11. పిల్లల్ని కూరగాయలు వగైరా
తెమ్మని పురమాయించడం
💥 12. మహిళా, పురుష ఉపాధ్యాయులు అతి
చనువుగా వ్యవహరించడం, పరాచికాలాడడం
💥 13. పిల్లల ముందు పోట్లాడుకోవడం, గట్టిగా వాదులాడుకోవడం.
💥 14. విద్యార్థుల పట్ల పక్షపాత
ధోరణి కనబర్చడం.
💥 15. క్లాసులకి ఆలస్యంగా వెళ్ళడం, పూర్తి కాకముందే బయటకు రావడం, అసలు వెళ్ళక పోవడం
💥 16. విద్యార్థులనువిచక్షణారహితంగా
దండించడం. చెడు పదజాలంతో దూషించడం.
💥 17. మధ్యాహ్న భోజనం వాళ్ళచే వేరే
కూరలు చేయించు కోవడం, మధ్యాహ్న భోజనం తినడం, పాఠశాలలో పార్టీలు
చేసుకోవడం.
👉 ఆత్మ విమర్శ చేసుకొని ఇందులో మనకేమైనా వర్తించేవి ఉంటే ఆవి మానుకుంటే అందరికీ
క్షేమదాయకం.
👉 కొస మెరుపు: ఎవ్వరూ చూడడం లేదు కదా అనుకోకండి. అన్నీ గమనించే వాళ్ళు పిల్లలు.
మన పిల్లలే కదా అనుకోకండి. వాళ్ళు కూడా సమాజంలో భాగమే.